ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. మాల మహానాడు డిమాండ్ . మాల మహానాడు డిమాండ్
రఘునాథ పాలెం మార్చి 01(జనం సాక్షి)ఈ నెల 04 న సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ సామాజిక అభివృద్ధి అను అంశం పైన జరుగు రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్లో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు సామాజిక కార్యకర్త గుంతెటి వీరభద్రం ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు న్యాయవాది తల్లమల్ల హసేన్ విచ్చేసి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో ప్రపంచీకరణ ప్రైవేటీకరణ అతివేగంగా విస్తరించినందువలన ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రభుత్వ శాఖలు నిర్వీర్యం చెంది ప్రైవేట్ రంగం విస్తరించడం వలన లక్షలాది ఉద్యోగాలు కోల్పోవడం జరిగిందని, కేవలం 8% ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ పరంగా ఉండటం వలన ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోవడం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో 92 శాతం ప్రైవేటుపరం జరగటం వలన ఉన్నత విద్యలు అభ్యసించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి యువకులు నిరాశ నిస్సృహలలో కొట్టుమిట్టాడుతూ తమ జీవితాలను తమ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉన్నదని అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సాధించటంలో 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో కూడా నూటికి 70 శాతం మంది ఎస్సీలు దారిద్య దివరేఖ లో ఉండటం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ నుండి భూమిని విద్యుత్ శక్తిని సబ్సిడీ రుణాలను తీసుకుంటున్న ప్రైవేట్ రంగ సంస్థలు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించవలసిన బాధ్యత ఉన్నదని అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే శాసనసభ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర సదస్సులో ఈ క్రింది డిమాండ్స్ ను అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలలో తమ మేనిఫెస్టోలో చేర్చాలని కోరినారు. 1. ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేయాలి.2. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల వారికి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు అమలు చేయాలి.3. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికని 4.నామినేటెడ్ పోస్టులలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలి.5 హైకోర్టు , సుప్రీంకోర్టు నియామకాలలో మరియు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సహాయ ప్రభుత్వ న్యాయవాదుల నియామకాలలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలి.6 . రాజ్యసభ సభ్యులు శాసనమండలి సభ్యుల ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లుకల్పించాలి.7. ప్రభుత్వ టెండర్ విధానాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేయాలి.8. ప్రభుత్వ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియమించే విధానాన్ని రద్దు చేయాలి. 9. మూసివేసిన ప్రభుత్వ రంగ సంస్థలను వెంటనే పునరుద్ధరించాలి..10. పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 15 శాతం నుండి 20 శాతం వరకు రిజర్వేషన్లు పెంచాలి ఎస్టీలకు 6 శాతం నుండి 10 శాతం వరకు పెంచాలి.11. నిరుపేద దళితులకు మూడు ఎకరాల భూమి డబల్ బెడ్ రూములు అందరికీ కల్పించాలి.12. దళిత బంధు పథకంలో అర్హులైన మాల కులం అందరికీ ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గిడ్ల పరంజ్యోతి రావు, అంబేద్కర్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి మేకతోటి కాంతయ్య, మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షులు ముండ్ల గిరి కాంతారావు ఖమ్మం జిల్లా మాల మహానాడు జిల్లా నాయకులు దాసరి శ్రీనివాస్, కొట్టే సుధాకర్ ,డోకుపర్తి బాలకృష్ణ, ఎర్ర గంగాధర్ ,టి రమ్య, బి ఉపేంద్ర ,ధారా రాములు కాకుమాను రామారావు, బి సోమరాజు, మైనార్టీ నాయకులు అబ్దుల్ రెహమాన్, బీసీ నాయకులు పెరుగు వెంకటరమణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు*