ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు….

న్యూఢిల్లీ : సరిగ్గా పదిహేను రోజుల క్రితం .. ఆదివారం ఉదయం.. ఆ అమ్మాయి కళ్లలో ఎన్నో కలల ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుందామనుకుంది. కాబోయే జీవిత భాగస్వామితో కలిసి ఎన్నో కలలు కంటోంది. ఇరుగు పొరుగు స్నేహితులతో కలిసి సమయం దొరికినప్పుడల్లా షాపింగ్‌ చేస్తూ పెళ్లికి కావలసిన వస్తువులు ఒక్కటొక్కటిగా సమకూర్చుకుంటోంది. ‘ ఆరోజు సాయంత్రం కాబోయే శ్రీవారితో సినిమాకు వెళ్తున్నాని చెప్పింది.. అంతే, పదిహేను రోజులు తిరిగేసరికి ఇలా కాలిబూడిదయింది. ‘ అని చెప్పిన ఆమె పొరుగింటి మహిళ గొంతు దు:ఖంతో పూడుకుపోయింది. ఆమె అంతకు రెండు రోజుల క్రితమే ఆ యువతితో కలిసి పెళ్లి దుస్తులు కొనడానికి వెళ్లారు. సామూహిక అత్యాచారానికి బలైన ఢిల్లీ యువతి ఇరుగు పొరుగు వారి వేదన ఇది వారంతా ఆమె ఆనందంలో పాలు పంచుకున్నారు. ఉద్యోగం సంపాదించుకోవడం.. భాగస్వామి ఎంపీక, జరగబోయే పెళ్లి గురించి కలలు, అన్ని అనందాలనూ ఆమో వారితో పంచుకుంది. ఆ బంగారు తల్లి కష్టాన్ని ఇసుమంత కూడా తాము పంచుకోలే కపోయామన్న ఆవేదన… నవ్వుతూ తుళ్ళుతూ తమ మధ్య  తిరిగిన ఆ ఉత్సాహవంతురాలు ఇక కనబడదన్న వాస్తవం.. వారిని తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి. మా చిట్టితల్లి ఏం పాపం చేసిందని ఆమెకిలా అర్థాయుష్షు ఇచ్చావంటూ దేవుడిని నిలదీస్తున్నాయి. వారి ప్రార్థనలు, ఈ రోజు ఉదయం ఆమె అంత్యక్రియలకు హాజరైన బంధువులు, స్నేహితులు మూర్తీభవించిన శోకదేవతల్లా కన్పించారు. ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యానికి ప్రతీకల్లా నిలిచారు.