ఫోటో రైటప్ : ఢిల్లీ తరలి వెళ్తున్న చేపూరి వినోద్, కాంగ్రెస్ నాయకులు
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 03 , (జనం సాక్షి ) : కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీలో ఆదివారం రోజున జరుగు ధర్నాకు స్టేషన్గన్పూర్ నియోజకవర్గం నుండి టిపిసిసి కార్యదర్శి చేపూరి వినోద్ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి తరలి వెళ్లారు. చేపూరి వినోద్ సొంత ఖర్చులతో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులను,నాయకులను ఢిల్లీకితీసుకువెళ్లారు. ఈ సందర్భంగా చేపూరి వినోద్ మాట్లాడుతూ కేం ద్రంలో బిజెపి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర ధరలు,మొదలగు వాటి ధరలు పెంచ డం వలన సామాన్య పేద ప్రజలు ఎన్నో ఇబ్బందు లు పడుతున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ద్వారా నే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎంతోఅభివృద్ధిజరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేవాదుల రిజర్వాయర్లు తీసుకువచ్చి శంకుస్థాపనలు చేయ డం జరిగిందని అన్నారు.ఇండ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందని,కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప, దేశంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధిచేయలేదని, పేద ప్రజలకు న్యా యం జరగలేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీని అధిక మెజారిటీతో గెలిపించుకోవాలనిఅందు కు నాయకులు కార్యకర్తలు ఇప్పటి నుంచే సైనికు ల్లా పని చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసు కువచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాల ని అన్నారు.ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్య క్షులు, నాయకులు పాల్గొన్నారు.