బళ్లారి వెళ్లిన ఏసీబీ ప్రత్యేక బృందం

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఏసీబీ ప్రత్యేక బృందం బళ్లారి వెళ్లింది. గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది.