బస్సుపై బాంబుదాడి 12 మంది మృతి

ఇస్లామాబాద్‌: షియా ముస్లింలతో వస్తున్న ఓ మినీ బస్సుపై బుధవారం బాంబుదాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఒరక్జాయి గిరిజన ప్రాంతం స్పాయి. గ్రామం నుంచి షియాలు బస్సులో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలనికి చేరుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.