బహిరంగంగా ఉరితీయాలని కోరుకున్నాం : బాధితురాలి కుటుంబసభ్యులు

న్యూఢిల్లీ : వైద్య విద్యార్ధినిపై సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్యకు పాల్పడటంపై బాధితురాలి కుటుంబసభ్యులు స్పందించారు. ఈ కేసులో ఎలాగైనా ఉరిశిక్ష ఖాయమని నిందితునికి తెలుసని, అయితే నిందితుడు తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవడం అనుచితమని బాధితురాలి సోదరుడు అన్నారు. అతన్ని అందరిముందు ఉరితీయాలని కోరుకున్నానని చెప్పారు. నిందితుడు జైల్లో ఆత్మహత్య ఎలా చేసుకున్నాడని, జైలు అధికారులు విఫలమయ్యారని తండ్రి ఆరోపించారు. ఈ ఘరటనలో తమకు న్యాయం జరగాలని కోరుకున్నామని తల్లి అన్నారు.

తాజావార్తలు