బహిరంగ సభ విజయవంతం చేయండి.
– నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాగం రమేష్.బెల్లంపల్లి, ఏప్రిల్ 3, (జనంసాక్షి )
నస్పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాగం రమేష్ పిలుపునిచ్చారు. ఈనెల 8న మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో నూతన కలెక్టరేట్ కార్యాలయం పక్కన మైదానంలో ఏర్పాటు చేసే హాత్ సే హాత్ జోడో యాత్ర పీపుల్స్ మార్చ్ బహిరంగ సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా కదిలిరావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ తో పాటు ఇతర నాయకులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్ము రాజేష్, డీసీసీ యూత్ సభ్యుడు లావుడ్య రమేష్, డీసీసీ సభ్యుడు గట్టు బానేష్, మధునయ్య, చంద్రమౌళి గౌడ్, మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.