బాధితులకు అండగా ఉంటు  ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటాం

-జిల్లా ఎస్ పీ కె. సృజన.గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 6 (జనం సాక్షి);
 శాంతిభద్రతల పరిరక్షణ లో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారానికి  పోలీస్ శాఖ చిత్తశుద్ధితో పని చేస్తుందని, బాధితులకు అండగా ఉంటు  ఫిర్యాదుల పై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని  జిల్లా ఎస్పీ  కె.సృజన అన్నారు.
సోమ వారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా వివిధ సమస్యల పై వచ్చిన 8 ప్రజా ఫిర్యాదులను  జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వారిని పోలీస్ స్టేషన్ ల వరకు పంపడం వంటి సంఘటనలు జరగడం పై విచారం వ్యక్తం చేశారు. అందుకు కారకులైన కుమారుల పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ప్రజావాణి లో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పై ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ, పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను  ఎస్పీ  ఆదేశించారు.   పిర్యాదు దారులు  సివిల్ వివాదాలను కోర్టులోనే పరిష్కరించుకో వలసిందిగా వారికి సూచించారు. బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ వారికి తెలియజేస్తూ చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ శాంతిభద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదులలో భూ వివాదాలకు సంబంధించి 3,ఇతరులు దాడి చేశారని 3,తల్లిదండ్రులు అయిన తమకు కుమారులు అన్నం పెట్టడం లేదని 1,ఇతర అంశాలకు సంబంధించి 1 ఫిర్యాదులు వచ్చాయని  ఎస్పీ సృజన తెలిపారు.