బాలకృష్ణకు బెయిల్‌ నిరాకరణ

డెెహ్రాడూన్‌: బాబా రాందేవ్‌ సహాయకుడు బాలకృష్ణకు సీబీఐ కోర్టు బెయిలు నిరాకరించింది. నకీలి ధృవపత్రాల కేసులో బాలకృష్ణపై నాన్‌ బెయిలబుల్‌ వారెంటు జారీ కావటంతో సీబీఐ అధికారులు నిన్న ఆయనను అరెస్టు చేశారు. ఈ రోజు సీబీఐ కోర్టులో హాజరుపరచగా ఆయనకు 14రోజుల జ్యుడీషియల్‌ కష్టడీ విధించారు. ఆయన దాఖలు చేసిన బెయిలు పిటీషన్‌ను కోర్టు తిరస్కరించింది.