బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు
….బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు….
చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :-మండల ప్రజా పరిషత్ కార్యాలయంలొ ఎంపీపీ విరోధ దుర్గారెడ్డి అధ్యక్షతన మండల బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పిల్లలు వారి హక్కులను ఉపయోగించుకోవాలని,(0 నుండి 18 సంవత్సరాల లోపు) పిల్లల హక్కులకి ఇబ్బంది కలిగించే సమస్యలు ఏవైనా ఉంటే,1098 నంబర్ కు సమాచారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి నెల అంగన్వాడీ కేంద్రంలో సిబిఈ (ఈవెంట్స్) సామాజిక వేడుకలను చేయడం జరుగుతుంది వీటి ముఖ్య ఉద్దేశం వెయ్యి రోజుల ప్రాముఖ్యత తెలియజేయడం గురించి అందులో భాగంగానే ఈరోజు చిలప్ చేడ్ అంగన్వాడి 1&2 కేంద్రాలలో అలాగే అక్షరాభ్యాసం చేయడం జరిగింది కార్యక్రమంలో తల్లులు పిల్లలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, ఎంపీడీవో శశి ప్రభ, శిలాంపల్లి సర్పంచ్ కవితచిలప్ చేడ్ ఉప సర్పంచ్ హన్మంతు , ఏపీఓ శ్యాం కుమార్, ఏపీఎం, హైస్కూల్ HM విట్టల్ సార్ , అంగన్వాడి సూపర్వైజర్ మార్తా,పోలీస్ సిబ్బంది,ICPS సిబ్బంది, నాగరాజు శ్రీనివాస్,యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ ఏయన్ఎం , అంగన్వాడీ టీచర్స్ ఆశవర్కర్ హెల్పర్స్, పాల్గొన్నారు