బిజెపి పాలనలోనే దేవాలయాలకు నూతన వైభవం.. బేజాడి బీరప్ప
బచ్చన్నపేట (జనం సాక్షి):బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామంలో 30వ తేదీన జరగబోతున్న శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని నూతనంగా కొనుగోలు చేసిన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాల కోసం ₹11,111. పదకొండు వేల నూట పదకొండు రూపాయలు సమర్పణ చేసినట్లు .భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానిగా నరేంద్రుడి పాలనలో దేవాలయాలకు నూతన వైభవం సంతరించుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సోమిరెడ్డి గారు
కందెన భిక్షపతి అధ్యక్షులు మహేశ్ లక్ష్మీనర్సయ్య కనకయ్య బాలకిషన్ ఉమేష్ మధు గణేష్.
వారితో పాటుగా స్థానిక నేతలు ,ఆలయ సిబ్బంది అధికారులు హాజరయ్యారు…