బీఆర్ఎస్‌లో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు.. సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ తో పాటు పలువురు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందరభంగా వారందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చడునీ, మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మంత్రులు సత్యవతి రాథోడ్, హరీశ్‌రావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు పలవురు నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ ప్రతినిధులు, పలువురు నేతలు, ఆయన మద్దతుదారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. భారీ కాన్వాయ్‌తో శరద్ జోషి ప్రణీత్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.