బీఎస్పీ నాయకులపరామర్శ..
శంకరపట్నం: జనం సాక్షి మార్చి 11
శంకరపట్నం మండలం, లింగపూర్ గ్రామంలో శనివారం బీఎస్పీ నాయకులు పరామర్శ చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి సమయ్య, పక్షవాతంతో అనారోగ్యానికి గురైనారు. తల్లి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో ఇటీవల మరణించగా కుటుంబ సభ్యులను,మాజీ ఎంపీటీసీ, సీనియర్ నాయకులు చల్లూరి భాగ్యలక్ష్మి భర్త, రాజ కొమురయ్య ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకుంటున్నాడని, సమ్మయ్యను, రాజ కొమురయ్యను పరామర్శించి,
కొంత సహకారంగా బియ్యం అందజేసినట్లు సంజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ హుజురాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు బండారి సదానందం నేత, శంకరపట్నం మండల అధ్యక్షులు దేవూనూరి భాస్కర్, మెట్ పల్లి సెక్టార్ అధ్యక్షులు కృష్ణ యాదవ్, నాయకులు చల్లూరి రాజేందర్, చల్లూరి మహేష్, పర్శారాములు యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.