బీపీ ఆచార్య బెయిల్‌పై విచారణ 8కి వాయిదా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితుడు బీపీ ఆచార్య బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు అక్టోబర్‌ 8 కి వాయిదా వేసింది. తనకు బెయిల్‌ ఇవ్వాలని ఆచార్య దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.