బీసీలకు పెద్దపీట వేస్తున్న కెసిఆర్
* బీసీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
బీసీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం 33 గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ కాలేజీలు మంజూరు చేసినందుకు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య అందించడంతో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిన కేసీఆర్ కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
పెండింగ్ లో ఉన్న బిసి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. బిసి సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనల్లో కాకుండా స్వంత భవనాలు నిర్మించి బిసి విద్యార్థులకు తగు సౌకర్యాలు కల్పించాలని మంత్రికి విన్నవించారు.
ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్,బిసి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు రాచమల్ల రాజు,దోగ్గలి శ్రీధర్,బిసి విద్యర్ధి నాయకులు బోయిని ప్రశాంత్, గాజే ప్రజ్యోత్,తల్లపల్లి మహేష్ గౌడ్, బియ్యాని తిరుపతి తదితర బిసి నాయకులు పాల్గొన్నారు.