బెల్లంపల్లిలో హోళి వేడుకలు.

 

 

 

 

 

ఫొటో : వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.
బెల్లంపల్లి, మార్చ్ 7, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గంలో మంగళవారం హోళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసి నెంబర్ 2 మైదానంలో స్వామి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోళి సంబారాల్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని వేడుకల్ని ప్రారంభించారు. హోళి సందర్బంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రవీణ్ పట్టణంలోని విధుల్లో తిరిగి హోళి శుభాకాంక్షలు తెలిపి రంగులు చల్లారు. వేడుకల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ బోనగిరి నిరంజన్ గుప్తా, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.