బై0సాడాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సి.పి.అర్ పై అవగాహన కార్యక్రమం…బై0సాడాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సి.పి.అర్ పై అవగాహన కార్యక్రమం… – అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే ఏ.ఎస్.పి
భైంసా రూరల్ మార్చ్ 04 జనం సాక్షి రాష్ట్రంలో వరుస హార్ట్ఎట్టక్ సంఘటనలు జరిగి పలువురు మృతి చెందిన సంఘటనలు రోజు వింటూనే ఉన్నాం. అయితే గుండె సంబంధిత నొప్పి వచ్చినప్పుడు సి.పి.ఆర్ చికిత్స అందించినప్పుడు వ్యక్తిని మరణం నుండి తప్పించవచ్చని బైంసా పట్టణంలోని డాక్టర్స్ అసోసియేషన్ లో డాక్టర్స్ అసోసియేషన్ వైద్యులు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముధోల్ తాలూకా ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి,భైంసా పట్టణ ఏ.ఎస్.పీ కాంతిలాల్ పాటిల్ హాజరై మాట్లాడారు… ప్రస్తుత రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయని,దానికి తగ్గ వ్యాయామాలు రోజు చేయాలని ముఖ్యంగా అందరికీ సి పి ఆర్ సిస్టంపై అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు,పలువురు ప్రజలు,వైద్యులు పాల్గొన్నారు.