బొగ్గు గనుల్లో భారీ అక్రమాలకు ప్రధానినే బాధ్యుణ్ని చేయడం పద్దతి కాదు

బెంగళూరు: బొగ్గు గనుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు కాగ్‌ ఇచ్చిన నివేదిక అంతిమం కాదని కేంద్ర విద్యుత్‌మంత్రి వీరప్పమొయిలీ అన్నారు. శనివారమిక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను బాధ్యుడిని చేసి నివేదిక ఇవ్వడం సరైన పద్దతి కాదన్నారు. కాగ& నివేదిక పార్లమెంట్‌ ప్రజా పద్దుల సమితి ముందు ఉందని, తరువాత పార్లమెంట్‌ ముందుకు వస్తుందని చెప్పారు. సీఏజీ నివేదిక ఆఖరి కాదని దానిపై వివిధ సంస్థలు పార్లమెంట్‌లో చర్చించిన తరువాతే అంతిమమని తెలిపారు.