బొజ్జ గణపయ్యకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు
నిర్మల్ బ్యూరో, ఆగస్ట్31,జనంసాక్షి,,, వినాయక చవితి పండగ సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన నివాసంలో ప్రతిష్టించిన గోమయ గణేషునికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు తొలి పూజ నిర్వహించారు. మంత్రి సతీమణి విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు పూజలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు ఆయన వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలతో విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు.