బొల్లారం పీఎస్‌లో తెలంగాణ ఎమ్మేల్యేల దీక్ష

హైదరాబాద్‌: బొల్లారం పోలీస్‌ స్టేషన్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలు తమ దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షలో ఎమ్మేల్యే హరిశ్‌రావుతో పాటు మరో నలుగురు ఎమ్మేల్యేలు ఉన్నారు. ప్రభుత్వం తెలంగాణ రైతులకు నిరాటకంగా ఏడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రకటించే వరకు ఈ దీక్ష కొనసాగుతూనే ఉంటదని ఎమ్మేల్యేలు చెప్పారు. ఇవాళ విద్యుత్‌ సౌధ ముందు కరెంట్‌ దీక్షు దిగిన ఎమ్మేల్యేలను అరెస్టు చేసిన పోలీసులు బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే.