బోల్లేపల్లి పెద్ద వెంకట రాజు చిత్ర పటానికి పూలమాలలు
వేసి నివాళులు – బివిఎన్ పద్మ రాజు కుటుంబానికి పరామర్శ హుజూర్ నగర్ మార్చి 7 (జనంసాక్షి): మండలంలోని శ్రీనివాసపురం గ్రామంకు చెందిన నవ తెలంగాణ స్టేట్ బ్యూరో ఇంఛార్జి బివిఎన్ పద్మ రాజు తండ్రి బొల్లేపల్లి పెద్ద వెంకట రాజు ఇటీవల గుండె పోటుతో మరణించారు. తీవ్ర శోకంలో ఉన్న పద్మ రాజు కుటుంబ సభ్యులను మంగళ వారం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందె సత్యం పరామర్శించారు. బోల్లేపల్లి పెద్ద వెంకట రాజు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివళులర్పించారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులను దైర్యంగా ఉండాలని కోరారు. పరామర్శించిన వారిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, మండల కార్యదర్శి పొసన బోయిన హుస్సేన్, మాజీ సర్పంచ్ తంగెళ్ళ వెంకట చంద్ర, గోపరాజు, పారుపల్లి శ్రీనివాస రావు (శ్రీ శ్రీ), పాశం వెంకట నారాయణ, సురేష్, శ్రీనివాస్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.