భక్తులతో కిక్కిరిసిన

వేములవాడ, జూన్‌-11, (జనంసాక్షి):

తెలంగాణాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేముల వాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధికి వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. సోమ వారం రోజున సుమారు 40 వేలకు పైగా భక్తులు విచ్చేసి ఆలయంలో వివిధ మొక్కుబ డులను నెరవేర్చుకున్నారు. స్వామివారికి భక్తు లు అభిషేకాలు, అన్నపూజలు, కోడె మొక్కు బడులు, కుంకుమ పూజలు, కళ్యాణాలు తదితర మొక్కుబడులు నెరవేర్చుకోగా వీటి వల్ల దేవస్థానానికి సుమారు 20 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.