భద్రాద్రి తలంబ్రాలు పంపిణీ

జనంసాక్షి, మంథని : భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవ తలంబ్రాలు మంగళవారం మంథనిలో సిటిఎం భాను కిరణ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా శాఖ కార్గో లాజిస్టిక్స్ ద్వారా భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణం లో ఉపయోగించిన ముత్యాల తలంబ్రాలు గోటితలంబ్రాలు కార్గో ద్వారా ముందస్తుగా బుక్ చేసుకున్న భక్తులకు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిటిఎం భాను కిరణ్, ఏటీఎం శ్రీనివాస్, ఆర్ ఎం ఈ రాజు, డి ఎం ఈ రాజేశ్వర్ , కార్గో ఏజెంట్ ఇందారపు నవీన్ పాల్గొన్నారు. భక్తుల కోరిక మేరకు తలంబ్రాల బుకింగ్ను ఈనెల 10 తేదీ వరకు పొడిగించినారని తెలిపారు. ఆసక్తి గల భక్తులు బస్టాండ్ లోని లాస్ట్ కౌంటర్లో లేదా డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వద్ద గానీ రూపాయలు116/చెల్లించి బుక్ చేసుకోగలరని కోరారు.