భవంతి పైకప్పు కూలి బాలిక మృతి

మాచర్ల:భారీ వర్షానికి ఓ భవంతి పైకప్పు కూలి బాలిక మృతి చెందిన ఘటన గుంటేరు జిల్లా మచార్ల మండలం చింతల్‌తండా గ్రామంలో చోటుచేసుకుంది.ఈ ఘటనలో ముగ్డురికి తీవ్రగాయాలయ్యాయి.మండలంలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుసున్న వర్షం కారణంగా భవంతి పైకప్పు ఒక్కసారిగా కూలింది.దీంతో భవంతిలో నిద్రిస్తున్న బాలిక అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు గాయాలతో బయటపడ్డారు.క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.ఘటనా స్థలికి మాచర్ల ఎమ్మేల్యే రామకృష్ణారెడ్డి చేరుకొని మృతిరాలి కుటుంబాన్ని పరామర్శించానరు.బాదితులను ఆదుకుంటామని హమీ ఇచ్చారు.