భార్య, బిడ్డపై హత్యాయత్నం
ఒంగోలు : ఆడపల్లి పుట్టిందనే అక్కసుతో ఓ కిరాతకుడు భార్య, బిడ్డపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పట్టణంలోని పాపకాలనీలో ఈరోజు చోటుచేసుకుంది. ఈ ఘటనలలో తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.