భువనగిరి బస్ స్టేషన్ ను సందర్శించిన రీజనల్ మేనేజర్..

.

 

 

 

 

 

భువనగిరి టౌన్ జనం సాక్షి:–
జిల్లా కేంద్రమైన భువనగిరి బస్ స్టేషన్ ను ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీదేవి గురువారం సాయంత్రం సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రమైన భువనగిరి బస్ స్టేషన్ నిత్యం వేలాదిమంది ప్రయాణికులు వస్తుంటారని, బస్ స్టేషన్ ను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని ఆమె డిపో మేనేజర్ శ్రీనివాస్ ను ఆదేశించారు. బస్ స్టేషన్ ఆవరణలోనికి ప్రైవేటు వాహనాలను అనుమతించరాదని ఆమె అన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం నీటి వసతి ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ఈకార్యక్రమంలో యాదగిరిగుట్ట డిపో మేనేజర్ శ్రీనివాస్, భువనగిరి బస్ స్టేషన్ మేనేజర్ పాషా, సిబ్బంది, వి వి రావు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.