భైంసా పట్టణంలో నీ రాహుల్ నగర్ లో కార్డాన్ సెర్చ్
భైంసా రూరల్ మార్చ్14 జనం సాక్షి
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రాహుల్ నగర్ లో మంగళవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన వాహన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు,3 ఆటోలు,2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు.తక్కువ ధరలో వస్తువులు,వాహనాలు కొని మోసపోవద్దని సూచించారు.ఫోన్ కు వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని అలాగే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.కాలనీలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే అపరిచిత వ్యక్తుల కదలికలు తెలుసుకోవచ్చన్నారు.ప్రతి ఒక్క వాహన దారుడు తప్పని సరిగా సరైన వాహన పత్రాలను కల్గి ఉండాలని తెలిపారు.