మంగళగిరి రాజగోపురం పటిష్టత పరీక్షిస్తున్న ఐఐటీ బృందం

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి తూర్పు రాజగోపురం పటిష్ఠతను చెన్నైకు చెందిన ఐఐటీ నిపుణుల బృందం పరీక్షస్తొంది. రాజగోపురం మనుగడపై గత రెండేళ్లుగా సందేహాలు వ్యక్తం కావడంతో  పునాదుల స్థాయి నుంచి పటిష్టతను  పరీక్షించడానికి ముగ్గురు నిపుణులు చైన్నై నుంచి వచ్చారు. గోపురానికి నాలుగు వైపులా మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. దేవస్థానం అధికారులు,  ఇంజినీరింగ్‌ శాఖ సిబ్బంది సహకరిస్తున్నారు. 1805లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 152 అడుగుల ఎత్తున 11 అంతస్తులతో దీనిని నిర్మించారు. ఈ నిర్మాణానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానముంది.