మండల పరిషత్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు

మండల పరిషత్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఎల్కతుర్తి మార్చి 25 జనంసాక్షి
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామములో ప్రభుత్వ  ప్రైమరీ పాఠశాలలో వార్షికోత్సవాలు  హెడ్మాస్టర్ సాల్మన్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ఆటపాటలతో నృత్యాలు చేస్తూ నాటికలు ఏకాపాత్రాభినయం జానపద గేయాలు పాడుతూ ఆడుతూ పిల్లల తల్లిదండ్రులను అధ్యాపకులను మైమరిపింపజేశారు ఇలాంటి ఉత్సవాలు ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా కనిపిస్తాయని ఇలాంటి ఉత్సవాలు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఎంఈఓ ఈసారి రవీందర్ అన్నారు పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు విద్యార్థులు కష్టపడి ఇష్టంగా చదవాలని అన్నారు పాఠశాల ఎ స్ఎంసీ చైర్మన్ సాతురి. కిష్టయ్య మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నడుస్తున్నాయని  ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను అధ్యాపకులు   అందిస్తున్నారని విద్యను వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సాల్మన్ తో పాటు ఎంపీటీసీ గొర్రె ఆదామ్ ఫైండ్ల తిరుపతిరెడ్డి.మాజి  సర్పంచ్  గుండ ప్రతాపరెడ్డి సర్పంచ్  చల్ల రవీందర్ రెడ్డి జడ్పీహెచ్ఎస్ పాటశాల హెచ్ ఎం రామాంజనేయులు. . అధ్యాపకులు శ్రీనివాస్.రవికుమార్.రమేష్. మొదలగువారు ఉన్నారు…