మంత్రికి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్

 గండూరి పావని కృపాకర్మంత్రికి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డిని బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట మున్సిపాలిటీ 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శోభకృత్ నామ సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.మంత్రి కి శుభాకాంక్షలు తెలిపిన వారిలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్, నూకల మధుసూదన్ రెడ్డి ,  నూకల వెంకట్ రెడ్డి, తేరటపల్లి సతీష్, కస్తూరి నవీన్, వార్డు నాయకులు బెజగం ఫణి,  ఇస్మాయిల్,  కళ్యాణ్ తదితరులు ఉన్నారు.