మంత్రి కేటీఆర్ కు సిరిసిల్లలో  నిరసనల సెగ.

మంత్రి కేటీఆర్ కు సిరిసిల్లలో  నిరసనల సెగ.
మంత్రి కారుకు ఎదురెళ్లి అడ్డుకొని నిరసన తెలిపిన ఏబీవీపీ కార్యకర్తలు. రాజన్న సిరిసిల్లబ్యూరో. మార్చి 27., (జనంసాక్షి).సిరిసిల్ల శాసనసభ్యులు మున్సిపల్ , ఐటీ,భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సిరిసిల్లలో నిరసనల సెగ తగిలింది. సోమవారం సిరిసిల్లలో పర్యటించిన క్రమంలో పలువురు ఏబీవీపీ నాయకులు మంత్రి కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష లీకేజీల విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరై తిరిగి వస్తుండగా ఏబీవీపీ కార్యకర్తలు అకస్మికంగా మంత్రి కేటీఆర్ కారును అడ్డగించి నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకొని కార్యకర్తలను లాక్కెళ్ళడంతో పరిస్థితి సద్దుమణిగింది. బిఆర్ఎస్ కంచుకోటలో మంత్రి కేటీఆర్ ను ఏబివిపి కార్యకర్తలు అడ్డుకోవడం చర్చ నియాంశంగా మారింది.