మంత్రి ధర్మాన ఇంటిని ముట్టడించిన కార్మికులు

శ్రీకాకుళం: ఫైడిభీమవరం ఆంధ్రాఆర్గానిక్స్‌ పరిశ్రమ యాజయాన్యం తీరుకు నిరసనగా కార్మికులు సీఐటీయూ అధ్వర్యంలో ఆర్‌.అండ్‌.బి మంత్రి ధర్మాన ప్రాసాదరావు ఇంటిని ముట్టడించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న పరిశ్రమ యాజయాన్యంపై మంత్రి ధర్మాన జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి గతంలో జాయింట్‌ కలెక్టర్‌ వద్ద జరిగిన ఒప్పందాలను అమలు చేయకుండా యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి గోవిందరావు ఆరోపించారు.