మంత్రి పదవులకు శరద్‌పవార్‌, ప్రఫుల్‌పటేల్‌ రాజీనామా

న్యూఢిల్లీ: కేంద్రమంత్రులు  శరద్‌పవార్‌, ప్రఫుల్‌పటేల్‌లు ఈ రోజు  తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను వారు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు  పంపారు. ఎన్సీపీకీ చెందిన ఈ ఇద్దరు మంత్రులూ నిన్న సాయంత్రం జరిగిన క్యాబినెట్‌ సమావేశానికి సైతం హాజరుకాలేదు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సంకీర్ణ ప్రభుత్వాన్ని  ఎలా నడపాలో కాంగ్రెస్‌కు తెలియదని వ్యాఖ్యానించారు. తమ శాఖకు చెందిన ప్రాజెక్టును కూడా ప్రభుత్వమే  నేరుగా క్లియర్‌ చేస్తోందని వారు. ఆరోపించారు. అయితే ఆర్థికమంత్రిగా ప్రణబ్‌ ముఖర్జీ రాజీనామా చేసిన అనంతరం నెంబర్‌టూ స్థానం తనకు ఇవ్వకపోవటమే శరద్‌పవార్‌ అలకకు అసలు కారణమని తెలుస్తోంది. ఎన్సీపీకి పార్లమెంట్‌లో 9 మంది ఎంపీలున్నారు.