మంత్రి సునీత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం

హైదరాబాద్‌: వికలాంగులకు ఇచ్చే పెన్షన్‌ పెంచేది లేదన్న మంత్రి సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యల పట్ల ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల సమస్యలు మానవత్వంతో ఆలోచించాల్సిన ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. రేపు జరప తల పెట్టిన 72 గంటల దీక్షను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేశామని. ఈ దీక్షను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద కానీ, సెక్రటేరియట్‌లో కానీ, మంత్రి సునితా లక్ష్మారెడ్డి కార్యాలయం ముందు కానీ చేపడతామన్నారు. డిసెంబరు 4న సామాజిక న్యాయం కోసం కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.