మంత్రులు రాజీనామా చేసి తప్పుకోవాలి : భాజపా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ ప్రాంత మంత్రులు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని భాజపా నేత విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని ఇప్పటికే వెల్లడించకపోవడంపై ఆయన మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 1న తెలంగాణలోని అన్ని మండలాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.