మంత్రుల కమిటీ తొలి సమావేశం

హైదరాబాద్‌:ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి,పార్టీ పరిస్థితి పై విశ్లేషణతో పాటు భవిష్యత్‌ కార్యాచరణ నిమిత్తం మంత్రుల కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది.ధర్మాన కన్వీనర్‌గా మంది మంత్రులతో ఏర్పాటైన ఈ కమిటీ ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో సమావేశమవుతుంది.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో పాటు పీసీపీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా సమావేశానికి హజరవుతారు.పార్టీ ప్రస్తుత పరిస్థితితో పాటు దిద్దుబాటు చర్యలుర,సంస్ధాగతంగా పటిష్ఠం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ దృష్టిసారిస్తుంది.త్వరలో జరగబోయే స్ధానిక సంస్థల ఎన్నికలతో పాటు 2014 సాదారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కమిటీ ప్రభుత్వానికి పార్టీకి తగు సూచనలు చేస్తోంది.