మంత్రుల బృందాన్ని అడ్డుకునేందుకు యత్నం
వరంగల్: ఎంజీఎం ఆసుపత్రి పరిశీలనకు వచ్చిన మంత్రుల బృందానికి నిరసనలు ఎదురయ్యాయి. మంత్రులు కొండ్రుమురళి, సారయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే మంత్రుల బృందం పర్యటనకు వ్యతిరేకంగా అత్యవసర విభాగం వద్ద జూడాలు ధర్నా చేపట్టారు. మరణాలు సంభవించాక వచ్చి ఏంచేస్తారంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు మంత్రులను అడ్డుకునేందుకు ఎంజీఎం పరిరక్షణ కమిటీ యత్నించింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.