మణిపూర్‌లో బాంబు పేలుళ్లు

ఇంఫాల్‌: మణిపూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున విషాదం చోటు చేసుకుంది. ఇంపాల్‌లో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పెరేడ్‌ గ్రౌండ్‌ వద్ద మూడు చోట్ల, తౌబాల్‌లో మరో పేలుడు సంభవించింది. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.