మతాలకు అతీతంగా సోదర భావంతో మెలగాలి : మధుయాష్కీ

కోరుట్ల జూలై 31 (జనంసాక్షి) : పట్టణంలో ముస్లిం సోదరులకు ప్రేరణ యూత్‌, యూనైటెడ్‌ ఆర్గనైజే షన్‌ ఫర్‌ హ్యుమన్‌ రైట్స్‌ వారి ఆధ్వర్యంలో వేరువేరుగా ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందులో నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌, కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ, ముస్లిం సోదరులు కులమతాలకు అతీతంగా సోదర భావంతో మెలగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో సింగిరెడ్డి నారాయణ రెడ్డి, డా|| అనూప్‌రావ్‌,  కస్తూరి లక్ష్మీనారాయణ, పేట భాస్కర్‌, తులసి కృష్ణ, జువ్వాడి కృష్ణారావ్‌, తిరుమల గంగాధర్‌, ఎంబేరి నాగభూషణం, సీఐ విజయ్‌ కుమార్‌, ఎస్సై సురేష్‌, నాగరాజ కుమారి, బోయిని వేణు, తిరునగరి రమణ, దూరిశెట్టి నర్సింహచారి, భూమేష్‌, వాజిద్‌, రఫీయోద్దిన్‌, ఖాజా మొయినొద్దిన్‌ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.