మద్యం మత్తులో సంపులో పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌: కుషాయిగూడలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు సంపులో పడ్డారు. ఇందులో ఒకరు మృతి చెందగా .. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతన్ని బయటకి తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు.