మధ్య నిషేదం దిశగా ప్రభుత్వం కృషి: మంత్రి ఆనం

శ్రీకాకుళం: మద్య నిషేదం దిశగా ప్రభుత్వం కృషిచేస్తుందని దానిలో భాగంగానే నూతన మద్య విధానాన్ని అమలు లోనికి తెచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామ్‌నారాయణ రెడ్డి అన్నారు. మద్య నిషేదం ఒక్కసారిగా అమలు చేస్తే ఎదురయ్యే పరిణామాలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చర్యలు తీసుకుంందన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన కోట దుర్గ అమ్మవారిని దర్శించుకొని మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ సబ్‌ కమిటీ నిర్ణయం మేరకు కేటాయించిన నిధులను ఈ ఏడాది వారి కోసం పూర్తిగా ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.