మన్మోహన్‌సింగ్‌ ప్రతిష్ఠకు రాజ్యాంగ సంస్థల కుట్ర

కాన్పూర్‌: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేందుకు కొందరు పెద్ద వ్యక్తులు, రాజ్యాంగ సంస్థలు కుట్రపన్నాయని కేంద్ర మంత్రి శ్రీప్రకాశ్‌ జైస్వాల్‌ ఆరోపించారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ప్రధానిని రాజీనామా చేయాలని కోరుతున్న వారు ముందు తాము రాజీనామా చేయాలని పేర్కొన్నారు. బొగ్గు కేటాయింపుల్లో భారీ కుంభకోణం జరిగినట్లు నిరాధార ఆరోపణలు చేస్తున్న వారు నీచ రాజకీయాల కోసం పార్లమెంట్‌ను స్తంబింప చేస్తున్నారని విమర్శించారు.