మరిన్ని సంక్షేమ కార్యక్రమాల అమలుకు రంగం సిద్దం

హైదరాబాద్‌:ప్రస్తుతం ఉన్న సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాలకు మెరుగులు దిద్దుతూనే మరిన్ని కొత్త కార్యక్రమాలను తెచ్చేందుకు రంగం సిద్దమవుతోంది.మంత్రి ఆనం నివాసంలో సమావేశమైన మంత్రుల కమిటీ ఈ విషయమై చర్చించింది.ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాల్లో లోపాలను అధిగమించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్‌ పార్టీని గ్రామస్థాయినుంచి పటిష్ఠ చేసుందుకు నిర్దిష్ట కాలపరిమితితో తగు చర్యలు తీసుకోవాలని అభిప్రాయ పడ్డారు.న్యాయస్థానాల్లో ఉన్న చిక్కులను అధిగమించి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మంత్రులు అభిప్రాయపడ్డారు.త్వరలోనే ప్రభుత్వానికి,పార్టీకి తగిన నివేదిక ఇస్తామని మంత్రి ఆనం తెలిపారు.రాష్ట్రంలో నాయకత్వ మార్పు అవసరం లేదని.2014ఎన్నికలకు ప్రస్తుత నాయకత్వంతోనే వెళతామని చెప్పారు.