మరో 24 గంటల్లో మోస్తరు వర్షాలు

విశాఖ: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలంగా మారాయని విశాఖ తుఫానుల హెచ్చరిక కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణీ చురుకుగా కదులుతోంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.