మలాలాపై దాడి కేసులో ముగ్గురు అరెస్ట్‌

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు చెందిన టీనేజీ బాలిక మలాలాపై దాడి కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మలాలా యూసుఫ్‌జాయ్‌ అనే 14ఏళ్ల బాలికపై గత మంగళవారం తాలిబన్లు దాడి చేసిన విషయం తెలిసిందే. మిలటరీ ఆస్పత్రిలో ఆమెకు శస్త్రచికిత్స చేసి బులెట్లను తొలగించారు. అయితే మరో 48గంటలవరకు ఆమె పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.