మళ్లీ మొదటికి వచ్చిన ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు
హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు మళ్లీ మొదటికి వచ్చింది. ఏఎఫ్‌ఆర్సీ నిర్దేంచిన రూ.50,200 ఏకీకృత ఫీజు విధానం అమలు చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులపై సర్కారు అప్పీల్ చేయనుంది. హైకోర్టుకు ఇంతకు ముందు ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు ఫీజుల ఖరారు పై ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. రూ.50,200 ఫీజు ఖరారు చేయాలని కొన్ని కళాశాలలను ఉద్దేశించి నిన్న మద్యంతర ఉత్తర్వులు జారీ కావడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ విదానాన్ని అమలు చేయడం ద్వారా సర్కారు చెల్లిస్తున్న బోధన ఫీజులపై అదనపు భారం పడటంతో పాటు పేద విద్యార్థులకు కష్టం కానుంది.