మహిళలకు రక్షణ కరువు…
-గ్రామ సర్పంచ్ కు అవమానం…
-మహిళా మేలుకో తల్లి…ఊరురా
– నా చెల్లి నవ్య కు…నేనున్న అని సద్దాం భరోసా…
– ఉప సర్పంచ్ సద్దాం ఉస్సన్..
–
వేలేరు 10 మర్చి జనంసాక్షి
శుక్రవారం రోజున స్టేషన్గన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ మండల్ జానకిపురం గ్రామ సర్పంచ్ నవ్య గారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఎమ్మెల్యే రాజయ్యను ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
వేలేరు ఉప సర్పంచ్ సద్దాంహుస్సేన్ డిమాండ్ చేశారు
ఎమ్మెల్యే రాజయ్య మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తప్ప నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని తీవ్రంగా మండిపడ్డారు అదే విధంగా
అన్నదమ్ములు అని చెప్పుకునే ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తమ్ముడు తప్పు చేస్తే ఖండించకుండా మౌనంగా ఉండడం వెనక అర్థమేంటో చెప్పాలని ప్రశ్నించారు
నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్న ఒక్కరు కూడా కనీస బాధ్యతతో ఒక మహిళను పరామర్శించకుండా మౌనం పాటించడం ఎంతవరకు సమంజసం అని తీవ్రంగా ధ్వజమెత్తారు
ఇకనైనా పార్టీ పెద్దలు రాజయ్య చేష్టలను కట్టడి చేసి మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సద్దాంహుస్సేన్ కోరారు
నవ్యను నా సొంత చెల్లిగా చూసుకొని అండగా ఉంటానని సద్దాంహుస్సేన్ వారికి భరోసానిచ్చారు.