మహిళా వైద్య ఉద్యోగినులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం
నాగర్ కర్నూల్ ఆర్సీ మార్చి 10(జనంసాక్షి):అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు అరోగ్య శాఖ అధికారి కార్యాలయం పాలెంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో మహిళ ఉద్యోగులకు మహిళల హక్కులపై అవగాహణ కల్పించారు.ఈ కార్యకరమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి సబిత మరియు జిల్లా వైద్య మరియు అరోగ్య శాఖ అధికారి హాజరై మహిళా ఉద్యోగులకు మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై ఉద్యోగినులకు వివరించారు.ఈ కార్య్రమంలో జిల్లా వైద్య మరియు అరోగ్య శాఖ అధికారి డా.కె.సుధాకర్ లాల్ మహిళ దినోత్సవం సంర్భంగా సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి సభితనీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మహిళా వైద్యులకు న్యాయ అధికారినులకు సన్మానం చేయడం.ఈ కార్య్రమంలో డిప్యూటీ డి.ఎం.ఎచ్.ఓ డా.వెంకట్ దాస్,ఎన్.సి.డి.పి.ఓ.డా.కృష్ణ మోహన్,డి.పి.ఓ.రెనయ్య,రెడ్ క్రాస్ సెక్రెటరీ రమేష్ రెడ్డి,జిల్లా యూత్ రెడ్ క్రాస్ కన్వీనర్ డి.కుమార్,న్యాయ శాఖ అధికారులు,వైద్య అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.