మహిళ దినోత్సవం రోజు మహిళకు అవమానం జెడ్పిటీసి అనిత
ఫోటోరైటప్:విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పిటీసి అనిత
పెన్ పహాడ్ మార్చి 08 (జనం సాక్షి) : మహిళా దినోత్సవం రోజు మహిళకు అవమానం జరిగిందని జెడ్పిటీసి మామిడి అనిత అంజయ్య అన్నారు బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జెడ్పిటీసి మామిడి అనిత అంజయ్య మాట్లాడుతూ స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మండల స్థాయిలో మహిళా దినోత్సవాన్ని ఆరోగ్య కేంద్రం డాక్టర్ స్రవంతి అధ్యక్షతన నిర్వహిస్తుండగా డాక్టర్ తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి తాను సకాలనికి హాజరు కాగా తనకు ఉత్తమ జెడ్పిటీసి అవార్డు వచ్చిందని అవార్డు తీసుకోవడానికి సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరు కావాలని ఇక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని వెళ్తానని డాక్టర్ కు తెలియజేయగా ఎంపీపి కార్యక్రమాన్ని కొంత సేపు ఆపాలని చెప్పారని అప్పటివరకు ఆగాలని లేకుంటే వెళ్ళొచ్చని తనను అవమానిచడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు తహసీల్దార్, ఎంపీడివో ఎవరు పట్టించుకోలేదని ఆరోపించారు అంతే కాకుండా గ్రామాల్లో ఎక్కడ కార్యక్రమాలు జరిగిన అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని తాను హాజరైన కార్యక్రమం ఎంపీపి కావాలని ఆలస్యం చెయ్యడం జరుగుతుందని తాను హాజరు కానీ చోట కార్యక్రమాన్ని త్వరగా ముగించి కార్యక్రమం పూర్తి చేసి కావాలని తనను అవమానిస్తున్నారని ఆరోపించారు ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నట్లు తెలిపారు…