మహిళ శిశుసంక్షేమపథకాలకు ప్రచారం

హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళా శిశుసంక్షేమ పథకాలకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమమంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. తమ శాఖ చేబట్టే కార్యక్రమాల ప్రచారం కోసం ఆమె ఒక గోడపత్రికను విడుదల చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సూపర్‌వైజర్ల ఉద్యోగాల ఖాళీలను తర్వరలోనే భర్తీ చేస్తామన్నారు.